![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద కొత్త మోనాలిసా వచ్చిందండి పూసలు అమ్ముకుంటూ..ఎవరు అనుకుంటున్నారా వర్షా. ఐతే సోషల్ మీడియాలో కుంభమేళా అంటే చాలు తేనే కాళ్ళ మోనాలిసా పేరుతో ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి తెగ వైరల్ అయ్యింది. ఓవర్ నైట్ ఆమె పిక్స్, వీడియోస్ వైరల్ అయ్యేసరికి ఆమెకు మూవీ ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. ఇప్పుడు ఈ టాపిక్ ని వర్ష, ఇమ్మానుయేల్ తీసుకుని జబర్దస్త్ స్కిట్ వేయడానికి రెడీ అయ్యారు. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ముందు వర్ష "పూసలమ్మ పూసలు" అని అమ్ముకుంటూ వస్తుంది.
.webp)
శివాజీ ఇది చూసి పర్ఫెక్ట్ గా సరిపోయావ్" అంటూ కామెంట్ చేసాడు. అది చూసిన ఇమ్ము వచ్చి వర్షతో మాట్లాడాడు. "ఏవండీ శివాజీ గారు రాత్రి 12 గంటలు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కి వచ్చి దుప్పటి ఇచ్చారు..అడిగితే ఎవరికీ ఏమీ చెప్పొద్దన్నారు" అని చెప్పేసరికి "ఆయన అంతే ఏది చేసినా రెండో కంటికి తెలియనివ్వడు" అన్నాడు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేసి పెట్టడంతో అవన్నీ వైరల్ అయ్యాయంటూ కొంతమంది వర్ష దగ్గరకు వచ్చేసరికి ఇమ్ము అది విని తెగ ఫీలైపోయాడు. ఆ తర్వాత డాన్సర్ పండు ఎంట్రీ ఇచ్చి "వర్ష గారికి నేను మేనేజర్ ని ఇపోయా" అంటూ చెప్పుకున్నాడు. "పూసలమ్ముకునేదానికి నువ్వు మేనేజర్ ఏంటి" అనేసరికి తలుపు వెనక నుంచి వర్ష మంచి బ్లాక్ షార్ట్ స్కర్ట్ తో ఎంట్రీ ఇచ్చింది. అది చూసిన ఇమ్ము ఎవరో హీరోయిన్ వచ్చేసిందంటూ హడావిడి చేసాడు. అప్పుడు వర్ష "స్టిక్కర్లే..బొట్టుబిళ్లలే" అనేసరికి నువ్వా అని ఆశ్చర్యపోయాడు.
![]() |
![]() |